LIVE: ఉరవకొండలో చంద్రబాబు 'రా కదలిరా' కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం - Naidu Ra Kadali Ra Program
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 4:08 PM IST
|Updated : Jan 27, 2024, 6:25 PM IST
Chandrababu Naidu Ra Kadali Ra Program LIVE : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీలేరులో శనివారం టీడీపీ రా కదలిరా పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించాయి. ఉదయం పీలేరు సమీపంలోని మదనపల్లె మార్గంలో జరిగే బహిరంగ సభకు పార్టీ నేతలు భారీగా సన్నాహాలు చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెలీకాప్టర్‌లో పీలేరుకు చేరుకున్నారు. బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తున్నారు.
అనంతరం అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఉరవకొండ సభలో పాల్గొంటారు. పార్టీ అవిర్భావం సందర్భంగా ఆనాడు ఎన్టీఆర్ రా కదలి రా అంటూ ఇచ్చిన పిలుపుతో ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఈ నెల 19న కమలాపురంలో సభ నిర్వహించగా, అన్నమయ్య జిల్లాలో తొలిగా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పీలేరులో సభకు సన్నాహాలు చేశారు. సభ ద్వారా గత నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, అరాచకాలు, దాడులు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. సీఎం జగన్ తప్పిదాలు, వైఫ్యలాలను ప్రజలకు వివరించబోతోంది. ప్రజలకు టీడీపీతోనే స్వర్ణయుగం సాధ్యమనే వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనుంది. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి, రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్‌గా మార్చిన జగన్ పాలనకు చమరగీతం పాడదామంటూ ‘రా కదలి రా’ ప్రచార పర్వాన్ని చంద్రబాబు చేపట్టారు.