ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు - Case On YSRCP MLA In Nellore

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 6:29 PM IST

Case On YSRCP MLA In Nellore Due to Election Code Voilation : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదైంది. రంజాన్‌ రోజు ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ ముస్లింలకు హామీల వర్షం కురిపించారు. ఈ ప్రసంగాలను ఈటీవీ-ఈనాడు ప్రచురించడంతో స్పందించిన అధికారులు ఆధారాలు స్వీకరించి కేసు నమోదు చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కోడ్​ ఉల్లంఘిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే యధేచ్ఛగా కొనసాగుతున్న వీరి కోడ్​ ఉల్లంఘనలకు అధికారులు మంచి గుణపాఠమే చెప్పారని ప్రజలు అంటున్నారు.ఎన్నికల కోడ్​ అమలులోకి వచ్చినా వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై పార్టీ ఫ్లక్సీలు హోర్డింగులు పెడుతున్నారు. వాలంటీర్లతో పార్టీ ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతల వ్యవహారంపై పలువురు ప్రతిపక్ష నేతలు పలు మార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ABOUT THE AUTHOR

...view details