ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు - Case registered on giddaalur MLA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 12:17 PM IST

Case Against on YSRCP MLA For Violation Of Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే అన్నా రాంబాబును (Anna Rambabu) మార్కాపురం నియోజకవర్గం అభ్యర్ధిగా వైఎస్సార్సీపీ అధిష్టానం నియమించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా లెక్కచేయకుండా ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా శ్లాబ్ నిర్మాణ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే రాంబాబుతో పాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ షంషీర్ అలిబేగ్, కౌన్సిలర్ సలీం పాల్గొన్నారు.

MLA Participated in Construction and Development Works of Shadi Khana Slab: ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా (Election Code Violation) అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడాన్ని రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తీవ్రంగా పరిగణించారు. మున్సిపల్ కమీషనర్ కిరణ్ ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నేతలపై రెండో పట్టణ ఎస్సై సువర్ణ కేసు నమోదు (Case Filed) చేశారు.

ABOUT THE AUTHOR

...view details