తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీఆర్​ఎస్​ఎల్పీలో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం - BRS Leaders press meet live - BRS LEADERS PRESS MEET LIVE

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 1:10 PM IST

Updated : Aug 3, 2024, 2:18 PM IST

BRS Leaders Press Meet Live : బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం శాసనసభలో ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జాబ్​ క్యాలెండర్​పై విమర్శలు గుప్పించారు. క్యాలెండర్​లో ఉద్యోగాలు ఉన్నాయి తప్ప వాటి సంఖ్య లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ, ఇప్పుడు యువతను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీఆర్​ఎస్ నేతలు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి జాబ్​ క్యాలెండర్​ అని చెప్పి ఇప్పుడు ఎన్ని పోస్టులో లేకుండా విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభలో అలా మాట్లాడం సరి కాదన్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 
Last Updated : Aug 3, 2024, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details