LIVE : బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - బీఆర్ఎస్ లైవ్
Published : Feb 11, 2024, 4:16 PM IST
BRS Leaders Press Meet Live : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. పూర్తి బడ్జెట్ తరహాలో సమగ్ర వివరాలు లేవని అన్నారు. దానితో పాటు ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్ల వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. కృష్ణానది నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసమే మరో ప్రజా ఉద్యమాన్ని కేసీఆర్ నల్గొండ సభ వేదికగా మరింత ఉదృతం చేయనున్నారని తెలుపుతున్నారు. మరోవైపు రాష్ట్ర గీతం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పుల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. తెలంగాణకు గర్వకారణంగా నిలిచే చార్మినార్ వంటి కొన్ని అరుదైన కట్టడాలు ఉన్నాయని తెలిపారు. కానీ తెలంగాణ చరిత్రను మరుగున పడవేసే కుట్రను రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.