LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders Press Meet - BRS LEADERS PRESS MEET
Published : Sep 23, 2024, 11:23 AM IST
|Updated : Sep 23, 2024, 11:55 AM IST
BRS Leaders Press Meet at Telangana Bhavan : రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్‌తో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురికి బీఆర్ఎస్ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ఆ కమిటీ ఇవాళ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. గాంధీ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలపై నివేదిక కోరారు. గాంధీ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతల పర్యటన దృష్ట్యా పోలీసు భద్రతను పెంచారు. ఆసుపత్రిలోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కమిటీలోని ముగ్గురు నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఆసుపత్రుల్లో అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకు అని అడిగారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని భావిస్తున్నారా అంటూ బీఆర్ఎస్ పలు ప్రశ్నలను సంధించింది. పోలీసుల చర్యలకు నిరసిస్తూ ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Last Updated : Sep 23, 2024, 11:55 AM IST