మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - BRS LEADER HARISH RAO LIVE
Published : 9 hours ago
|Updated : 9 hours ago
BRS Leader Harish Rao Live : తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసుపై హరీశ్‌రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిందన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌పై సభలో చర్చించాలని కోరామని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులను శాసనసభ నుంచి బయటకి పంపి చర్చించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు పలు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి శాసనసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు అని హరీశ్‌రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్ రేసింగ్‌పై పలు విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏవీవీ కంపెనీ డిసెంబర్ 22న దానం కిశోర్‌కు లేఖ రాశారు తెలిపారు. మూడో విడత కింద 45 లక్షల పౌండ్లు చెల్లించకపోవడం వల్ల అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని లేఖ రాసిందని వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : 9 hours ago