ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పెట్రోల్‌ బంక్‌ వద్ద నల్లతాచు కలకలం- బుసలు కొడుతూ పైకి లేచిన పాము - Black Rattle Snake hulchul - BLACK RATTLE SNAKE HULCHUL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 7:22 PM IST

Black Rattle Snake at Petrol Bunk: అంబేద్కర్ కోనసీమ జిల్లా వేమవరంలో స్కూటీ డిక్కీలో నల్ల తాచు పాము కలకలం రేపింది. జానుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోయించుకోవడానికి బంక్​ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో స్కూటీ డిక్కీ తెరవగా అందులో పాము బుసలు కొడుతూ పైకి లేచింది. పామును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఘటనాస్థలికి చేరుకుని పామును బంధించారు. అనంతరం పామును తీసుకెళ్లి జనసంచారం లేని ప్రదేశంలో విడిచిపెట్టారు. 

వర్షాకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ కాలం పాములకు అనువైన కాలం. బొరియలు, పుట్టల్లో ఉండే పాములు ఆహారాన్వేషణ కోసం తమ ఆవాసాలను వదిలి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలాల గట్లు వద్ద, పశువుల పాకలు, పొదల్లో తిరుగుతూ ఉంటాయి. ఇది గమనించక చాలామంది పాము కాట్లకు గురవుతున్నారు. అందువల్ల చిన్నారులు, విద్యార్థులు, రైతులు వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి.   

ABOUT THE AUTHOR

...view details