ప్రజల భూములు కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది: బీజేపీ నేత యామినీ శర్మ - BJP Leader Yamini Sharma - BJP LEADER YAMINI SHARMA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 1:58 PM IST
BJP Leader Yamini Sharma Comments on Land Titling Act : ప్రజల భూములు కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త మోసానికి తెరలేపిందని బీజేపీ నేత యామినీ శర్మ విమర్శించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాప్ట్ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ దోపిడి ఎజెండాకు అనుకూలంగా మార్చుకొని చీకటి జీవోలు తెచ్చిందని ఆరోపించారు. అయిదేళ్లగా వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ, దేవాదాయ భూములు దోచుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని రాష్ట్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
వైఎస్సార్సీపీ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం పట్ల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని యామినీ శర్మ పేర్కొన్నారు. రైతుల భూ పట్టాలపై జగన్ పెత్తనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పరిపాలన మొత్తం దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని మండిపడ్డారు. జగన్ అయిదేళ్ల పాలన విశ్వాస ఘాతుకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నీతి అయోగ్ చెప్పిన అంశాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులకు అసలు పొంత లేదని పేర్కొన్నారు.