కేశినేని నాని దిగజారిపోయి మాట్లాడుతున్నారు - సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు - Sujana Chowdary on Kesineni Nani - SUJANA CHOWDARY ON KESINENI NANI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 9:25 PM IST
Sujana Chowdary Comments on Kesineni Nani: మూడు పార్టీలు కలసి కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు సహజమని బీజేపీ విజయవాడ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. జనసేన నేత పోతిన మహేష్ కూడా తమతో కలసి ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కేసినేని నాని ఇటీవల దిగజారిపోయి మాట్లాడుతున్నారని, ఆ స్థాయికి దిగి తాను విమర్శించలేనని అన్నారు. ఇంత త్వరగా కేశినేని నాని దిగజారిపోతారని తాను అనుకోలేదన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపిక చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని సుజనా చౌదరి అన్నారు. విజయవాడకు తాను లోకల్ అని, ఈ ప్రాంతంలోనే పుట్టానని, చదువుకున్నానని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి, ఓ శాసనసభ్యునిగా ఏం చేయవచ్చో అన్నీ చేసి చూపిస్తానని తెలిపారు. తాను వేరే రాష్ట్రం నుంచి రాలేదని, కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం వచ్చినందున కొద్దిరోజుల్లోనే ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశాన్ని ప్రధాని మోదీ వికసిత్ భారత్‌గా మార్చారని కొనియాడారు.