పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉండదు : ఎంపీ లక్ష్మణ్ - బీజేపీ లోక్‌సభ ఎన్నికలు
Published : Jan 28, 2024, 4:04 PM IST
BJP Focus On Parliament Elections : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఏటీఎం కాబోతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీకి దిగుతామని స్పష్టం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెండు అంకెల స్థానాల్లో గెలవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని, దేశమంతా మోదీ అభివృద్ధికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఇండియా కూటమి బీటల పరిణామంతోనే బిహార్ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. బీజేపీ ఎప్పుడూ నీతీష్ కుమార్‌పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు.
MP Laxman Comments On Congress : కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, దోపిడీని బయట పెడతామని చెప్పి ఇప్పుడేమో గొంతులు మూగబోతున్నాయని లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. సీఎం మొత్తం ప్రాజెక్టుపై విచారణ అంటే, మంత్రి మాత్రం మేడిగడ్డ వరకే ఎంక్వైరీ అంటున్నారని విమర్శించారు. కుల గణనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కె.లక్ష్మణ్ తెలిపారు.