మళ్లీ ఎలుగుబంటి వచ్చింది - చీకటి పడితే భయపడుతున్న ప్రజలు - Bears hulchul in Kalyanadurgam - BEARS HULCHUL IN KALYANADURGAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 1:30 PM IST
Bears hulchul in Kalyanadurgam : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. మార్కెట్ యార్డ్ సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. ఇటీవలి కాలంలో ఎలుగుబంట్లు కాలనీలోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. చీకటి పడితే కాలనీలోని ఇళ్లల్లోకి వస్తున్నాయని చెప్పారు. గతంలో కూడా ఎలుగు బంట్లు ఇళ్లలోకి చొరబడ్డాయని, జనావాసాల్లో తిరిగి తమను భయాందోళనలకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. జులై 28న రాత్రి కూడా దొడగట్టరోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్లోకి చొరబడిన ఎలుగు సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. ఏజెన్సీ లోపల గందరగోళం సృష్టించి, బిస్కెట్ బాక్సులు ముక్కలు చేసి, బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సంగతి తెలిసిందే. చీకటి పడితే చాలు చుట్టూ జనావాసాలు ఉన్నా ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది అని మంగళ కాలనీ, పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో నిసిస్తున్న ప్రజలు వాపోయారు.