డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బాలినేని - Balineni Srinivasa Reddy
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 5:48 PM IST
Balineni Srinivasa Reddy Distribute Land Titles: ఒంగోలులో పేదలకు ఈ నెల 20న సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. 25 వేల మందికి ఒంగోలు నగరంలో ఇళ్ల పట్టాలు పంపిణీ (House Titles Distribution in Ongole) చేస్తున్నట్టు తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఆపేందుకు కొంత మంది కోర్టును ఆశ్రయించారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందకుండా ప్రయత్నించే వాళ్లు సిగ్గుపడాలని బాలినేని అన్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం భూములు ఇచ్చిన రైతుల వద్ద నుంచి తాను డబ్బులు తీసుకున్నానని ఏ పార్టీ వారైనా వచ్చి నిరూపిస్తే రాజకీయాల నుంచి విరమిస్తానని బాలినేని చెప్పారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నానని ఏనాడు ఏ తప్పు చేయలేదని అన్నారు. తప్పులు చేసే వాడినే అయితే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగుతానా అని అన్నారు.