LIVE: విశాఖలో బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'- ప్రత్యక్షప్రసారం - Balakrishna election campaign - BALAKRISHNA ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 4:53 PM IST
|Updated : May 3, 2024, 7:55 PM IST
Balakrishna Swarnandhra Sakara Yatra Live: ఎన్నికల సమీపిస్తున్న వేళ నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'కు సంఘీభావం తెలిపుతున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ రాక్షస పాలనను అంతం చేయాలని ప్రజలకు బాలకృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు బాలకృష్ణ వివరిస్తూ కేంద్ర సహకారం కోసమే బీజేపీ పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. ముస్లింలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ వర్గాల వారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : May 3, 2024, 7:55 PM IST