ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: నందికొట్కూరు స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష ప్రసారం - Nandikotkur Balakrishna Live - NANDIKOTKUR BALAKRISHNA LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 6:06 PM IST

Updated : Apr 15, 2024, 6:54 PM IST

Balakrishna Election Campaign in Nandikotkur Live: టీడీపీ అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం సప్తగిరి కూడలిలో స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షోలో పాల్గొన్న బాలకృష్ణ కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టదైవమని, దుష్ట శిక్షణకు వెలసిన స్వామి దర్శనంతో వైఎస్సార్సీపీ పాలన అంతానికి సైకిల్‌ రావాలని స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే ముస్లింలకు ఉన్న బీసీ-ఇ రిజర్వేషన్‌ రద్దు చేస్తారంటూ అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీతోనే ముస్లింలకు ఎంతో మంచి జరిగిందన్నారు.  ప్రస్తుతం నంద్యాల జిల్లా నందికొట్కూరు స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 15, 2024, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details