ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ- ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 10:11 AM IST

Updated : Jan 22, 2024, 3:33 PM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha LIVE : శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తియ్యాయి. కన్నుల పండువుగా సాగే ఈ క్రతమవుకు సరిగ్గా మధ్యాహ్నం శుభముహూర్తం 12 గంటల 20 నిమిషాలకు ముహూర్తం సిద్దం చేశారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై, దాదాపు ఒంటిగంటకు పూర్తికానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సాధుసంతువులు, ప్రముఖులు కలిపి ఏడు వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 7 వేల మందిలో జాబితా A 506 మంది అత్యంత ప్రముఖులను చేర్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు ప్రాణప్రతిష్ఠకు అతిథేయులుగా వ్యవహరించనున్నాయి.

సంప్రదాయాన్ని అనుసరించి వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని వైవిధ్యమైన పూలతోనూ, రంగు రంగుల విద్యుద్దీపాలతోనూ అలంకరించారు. శ్రీరాముడి భవ‌్యమందిరాన్ని జీ+2 పద్దతిలో నిర్మించారు. భక్తులు తూర్పున 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు.

Last Updated : Jan 22, 2024, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details