ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'బాధితులకు అండగా ఏపీ న్యాయసేవాధికార సంస్థ'- పోక్సో చట్టంపై అవగాహన - Awareness POCSO Act in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:52 PM IST

Awareness Program on POCSO Act in Vijayawada : బాలికలపై నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్ష పడేలా పోలీస్​, న్యాయ, బాలల సంక్షేమ శాఖలు సమన్వయంతో పని చేయాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం. బబిత పేర్కొన్నారు. విజయవాడలోని గవర్నర్​పేటలోని ఓ హోటల్​లో ఏపీ న్యాయసేవాధికార సంస్థ, చైల్డ్​ రైట్స్​ అడ్వకేసీ ఫౌండేషన్​ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి కన్సలేట్​ కార్యక్రమం ఆదివారం ముగిసింది.

లైంగిక వేధింపులు, పోక్సో చట్టంపై తల్లిదండ్రులు, పిల్లలకు చైతన్యం కలిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని బబిత తెలిపారు. చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి, లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. బాధితుల నుంచి సకాలంలో వివరాలు సేకరించి, నిందితులపై కేసులు నమోదు చేయాలని కోరారు. లైంగిక వేధింపుల కేసుల్లో అధికార యంత్రాంగం సమన్వయం చాలా ముఖ్యమని ఏపీ బాలల హక్కుల కమిషనర్​ ఛైర్మన్​ కేసలి అప్పారావు తెలిపారు. సదస్సులో నివేదించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. పోక్సో కేసుల్లో ఫోరెన్సిక్​ ఇన్వెస్టిగేషన్​కు డేటా సేకరణలో అనుసరించాల్సిన పద్ధతులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details