ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వివేకా హత్యకేసు - అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - YS Viveka Case updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 8:00 PM IST

Avinash Reddy's Bail Cancellation Petition : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత పిటిషన్‌ దాఖలు చేయగా ఏప్రిల్‌ 22 తర్వాత వాదనలు వింటామని న్యాయస్థానం వెల్లడించింది. ఏప్రిల్ 22కి ముందు కేసు విచారణకు తీసుకునే పరిస్థితి లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఏప్రిల్‌ 22లోపు కేసు డైరీ వివరాలన్నీ తమ ముందుంచాలని ధర్మాసనం సూచించింది. కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్‌ చేయాలని, డిజిటలైజ్‌ పూర్తయ్యాక తమ ముందుంచాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు, కేసు డైరీ వివరాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. 

కాగా, ఇదే కేసులో నిందితుడికి మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిందని సునీత తరఫు న్యాయవాది లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌ చేశారని తెలిపారు. మెుత్తం 4 పిటిషన్లు వేశామని, త్వరగా విచారణ చేపట్టాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. కాగా విచారణ చేపట్టేందుకు సిద్ధమే కానీ సమయం అనుకూలించాలి కదా అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బదులిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details