ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫొటోగ్రాఫర్‌పై కటర్​తో దాడి - బ్లేడ్ బ్యాచ్ పని కాదన్న పోలీసులు - ఫొటోగ్రాఫర్​పై దాడి న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 4:43 PM IST

Attack On Photographer in Vijayawada : విజయవాడ కృష్ణలంకలో అరవిందరెడ్డి అనే ఫొటోగ్రాఫర్​పై కొంతమంది యువకులు కటర్‌తో దాడి చేశారు. గాయపడిన బాధితుడిని స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు శస్త్ర చికిత్స చేయగా ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే మెుదట్లో ఈ దాడి చేసింది బ్లేడ్ బ్యాచ్ అని అందరూ అనుకున్నారు. విచారణ అనంతరం దాడి చేసింది బ్లేడ్ బ్యాచ్ కాదని పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. 

రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. డబ్బులివ్వకపోతే బ్లేడ్లతో విచక్షణరహితంగా దాడి చేస్తున్నారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో బ్లేడ్​ బ్యాచ్​ నడిరోడ్డుపై యువకుడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అదేవిధంగా విజయవాడలోని రైతు బజారులో కూరగాయలు దింపేందుకు వెళ్తున్న కార్మికుడిపై మత్తులో ఉన్న ‌గ్యాంగ్‌ బ్లేడ్లు, కర్రలతో దాడి చేసి నగదు దోచుకెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details