ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్​ సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ జెండా ఎగరేస్తాం : అచ్చెన్నాయుడు - అచ్చెన్నాయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 8:27 PM IST

Atchannaidu Comments on CM Jagan: రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి సొంత నియోజకవర్గమైనా పులివెందులలోనూ తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని,  11 లక్షల కోట్ల రూపాయలు అప్పుల రూపంలో తీసుకువచ్చారని అన్నారు.  రాష్ట్రంలో  వైఎస్సార్​సీపీ నేతలు దోపిడీ చేశారని మండిపడ్డారు. 

ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కిడికెళ్లినా ప్రజలు వైఎస్సార్​సీపీని అసహ్యించుకుంటున్నారని వివరించారు. రానున్న ఎన్నికల్లో టెక్కలిలో 50వేల మెజార్టీ రావాలని అచ్చెన్న అభ్యర్థించారు. టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తానని  ఆయన హామీ ఇచ్చారు. లోకేశ్‌ సహకారంతో టెక్కలిలో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 72 శాతం వంశధార ప్రాజెక్టు పూర్తి  చేస్తే, వైఎస్సార్​సీపీ హయాంలో వంశాధార ప్రాజెక్టు మట్టితో నిండిపోయిందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారికి చక్రవడ్డీతో సహా తిరిగి  బదులు చెల్లిస్తామని అచ్చెన్న పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details