ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మట్టి తవ్వకాలు - వైఎస్సార్సీపీ నాయకుల మధ్య వాగ్వాదం - పీఎస్​కు చేరిన పంచాయితీ - Argument between YCP workers - ARGUMENT BETWEEN YCP WORKERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 8:43 PM IST

Argument Between YCP Workers Over Soil Digging in YSR District : మట్టి తవ్వకాల విషయంలో వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం వైఎస్సార్ జిల్లాలో కలకలం రేపింది. ఇరు కార్యకర్తల మధ్య నెలకొన్న గొడవ చివరకు పోలీస్ స్టేషన్​కు చేరింది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని వేంపల్లె మండలం పాములూరు రోడ్డులో ఉన్న 207 సర్వే నంబర్‌ భూమిలో వైసీపీ ఎంపీటీసీ భారతి ఈరోజు జేసీబీతో మట్టి తవ్వకాలు చేపట్టారు. తన భూమిలో మట్టి తవ్వకాలు చేస్తున్నారని హరిజనవాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఓటులేశు అడ్డుకున్నారు. 207 సర్వే నెంబరులో 1.60 సెంట్లు భూమిని ప్రభుత్వం డీకేటీ పట్టాను తనకు ఇచ్చిందని ఓబులేసు చెప్పారు. 

తన భూమిలో ఎలా తవ్వకాలు చేస్తారని ఓసులేసు నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. 300 ఎకరాలు లీజుకు తీసుకుని ప్రభుత్వానికి డబ్బులిచ్చి మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఎంపీటీసీ భారతి తెలిపారు. లీజు తీసుకున్న భూముల్లోనే మట్టి తవ్వకాలు చేయాలని పట్టా భూముల్లో ఎలా తవ్వకాలు చేస్తారని ఓబులేశు నిలదీశారు. మట్టి తవ్వకాల్లో వైసీపీ కార్యకర్తలు మధ్య జరిగిన గొడవ చివరికి పోలీసు స్టేషన్​కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details