ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : సింగనమలలో వైఎస్ షర్మిల న్యాయయాత్ర బహిరంగ సభ - AP Nyaya Yatra in Singanamala - AP NYAYA YATRA IN SINGANAMALA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 5:51 PM IST

Updated : Apr 18, 2024, 6:28 PM IST

Sharmila Nyaya Yatra in Singanamala LIVE : ఏపీ న్యాయ యాత్ర, APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షనేతగా మడకశిర వచ్చి అనేక హామీలిచ్చిన జగన్‌ ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్కటీ నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్‌ తనయుడినని చెప్పుకుంటున్న జగన్‌ ఆయన ఆశయాలను నీరుగార్చుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలను కూడా అమ్మేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు గానీ, జగన్‌ మాత్రం నాలుగున్నర సంవత్సరాల తర్వాత నిద్రలేచాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వ్యవసాయానికి ఆదరణ లేక వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం సింగనమలలో వైఎస్‌ షర్మిల ఏపీ న్యాయ యాత్ర బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 18, 2024, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details