LIVE : హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం - ప్రత్యక్షప్రసారం - AP CM CBN Rally in Hyd - AP CM CBN RALLY IN HYD
Published : Jul 5, 2024, 7:26 PM IST
|Updated : Jul 5, 2024, 8:07 PM IST
CM Chandrababu rally in Hyderabad : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో రెండో రోజు పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు దిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు నివేదించి, ఏపీకి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అంతకుముందే నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు.తాజాగా శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యేందుకు హైదరాబాద్‌కు చంద్రబాబు చేరుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు శనివారం ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. దీంతో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీకి ప్రణాళిక వేశారు. తెలంగాణ టీడీపీ కార్యకర్తల ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. తెలంగాణలో చంద్రబాబు ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 5, 2024, 8:07 PM IST