ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రెస్ మీట్ - ప్రత్యక్ష ప్రసారం - BJP Purandeswari Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 11:14 AM IST

Updated : Feb 22, 2024, 11:42 AM IST

AP BJP President Purandeswari Press Meet: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పొత్తులపై అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కొద్ది రోజుల క్రితం తెలిపారు. పొత్తుల వ్యవహారం అంతా దిల్లీలోనే నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తాము మాత్రం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'పల్లెకు పోదాం' వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. పొత్తులపై ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను అధిష్ఠానం తీసుకుందని తెలిపారు.

అదే విధంగా ఇప్పటికే ఇతర పార్టీల్లో నుంచి బీజేపీ చేరికలు జరుగుతున్నాయి. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా దరఖాస్తులు వచ్చాయని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు. తాజాగా పొత్తుల అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు కోసం తాను ఎన్నో మాటలు పడ్డానని అన్నారు. ప్రస్తుతం పొత్తులపై పురందేశ్వరి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం. 

Last Updated : Feb 22, 2024, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details