ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్‌ పాలనలో ప్రజలకు మంచి జరగలేదు- అక్రమంగా సొమ్ము దోచుకున్నారు: అంబటి రాయుడు - Ambati Rayudu Election Campaign - AMBATI RAYUDU ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 3:50 PM IST

Ambati Rayudu Election Campaign on Behalf of NDA Alliance: రాష్ట్రంలో రాచరికం తరహాలో జగన్ పాలన సాగుతోందని భారత జట్టు మాజీ క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంబటి తిరుపతి రాయిడు ఆరోపించారు. ఎన్డీఏ కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. సీఎం జగన్​ను ఆ పార్టీ ఎమ్మెల్యేలే కలవలేరని అలాంటి వారు ప్రజలకు ఏం మంచి చేస్తారని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు రావాలాన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సూచించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అంబటి రాయుడు అన్నారు. ప్రజల భవిష్యత్తు మారాలంటే కూటమి ప్రభుత్వం రావాలని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు అస్సలు మంచి జరగలేదని ఆరోపించారు. వైసీపీలో ఉన్న నాయకులు అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆలోచనలు నచ్చి జనసేనలో చెరినట్లు అంబటి రాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details