ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజధాని పనులు ప్రారంభంతో మొక్కులు తీర్చుకుంటున్న రైతులు - Capital Women Paying Dues

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 10:52 PM IST

Amaravathi Works Was Start Capital Women Paying Their Dues: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధాని పనులు ప్రారంభించిందని రాజధాని రైతులు సంతోషంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండ రాయినిపాలెంలో రైతులు పొంగళ్లు పొంగించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నీరు, మట్టిని నిక్షిప్తం చేసిన ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సుఖ సంతోషాలతో ఉంటారని రైతులు చెప్పారు. 

గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు రాజధాని లేక ఎంతో ఇబ్బంది పడ్డారన్నారని మహిళలు అన్నారు. మూడు సంవత్సరాలలో రాజధానిలో ప్రారంభమైన నిర్మాణాలన్నీ పూర్తవుతాయని అప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధితో కలకలలాడుతోందని మహిళలు, రైతులు అంటున్నారు. అమరావతికి జై అంటూ నినాదాలు చేశారు. అమరావతి అభివృద్ధి  చెందాలని, నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలంటూ వివిధ దేవాలయాలకు వెళ్లి రైతులు, మహిళలు పూజలు చేస్తున్నారు. అనంతరం సన్నిధిలో టెంకాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details