ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ-జనసేన బహిరంగ సభకు 'జెండా'గా పేరు - Devineni comments on jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 8:46 PM IST

TDP and Janasena Joint Public Meeting: తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న తెలుగుదేశం, జనసేన ఉమ్మడి బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం 'జెండా'గా నామకరణం చేశారు. బహిరంగ సభలో జనసేన, తెలుగుదేశం పార్టీలు తమ ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఇరుపార్టీల అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని దేవినేని ఉమ వెల్లడించారు. జనసేన, టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమం రెండూ సమన్వయం చేస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామన్నారు. 

అన్ని వర్గాల ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని  దేవినేని మండిపడ్డారు. కుప్పం బ్రాంచి కెనాల్​లో రెండో లిఫ్ట్​ నుంచి మూడో లిఫ్ట్​కు నీళ్లు తీసుకురావడానికి 57 నెలలు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 30 కోట్లు ఖర్చు పెట్టానని డబ్బా కొట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం రాష్ట్రంలో అరాచక పాలకు నిదర్శనమని దేవినేని ధ్వజమెత్తారు. కాలువ మీద సెట్టింగ్​లు పెట్టి కుప్పం ప్రజలను జగన్​ మోసం చేశారని విమర్శించారు. సీఎం గేట్లు ఎత్తి వెళ్లిన తరువాత ఆ గెట్లను ఎత్తేశారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ వదిలిన నీళ్లు ఎక్కడికి వెళ్లాయో చూపించాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలు నీళ్లు లేని కాలువలో కూర్చొని ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details