ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నేటి నుంచి విజయవాడ - హైదరాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు - vijayawada Air India Flight service - VIJAYAWADA AIR INDIA FLIGHT SERVICE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 1:59 PM IST

Air India Flight Services From Vijayawada– Hyderabad: ఈరోజు నుంచి విజయవాడ – హైదరాబాద్‌కు విమానాలు నడపడానికి మరో దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ముందుకొచ్చింది. విజయవాడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ విమాన సర్వీసులు అందించనుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విజయవాడ - హైదరాబాద్‌ మార్గంలో రెండు సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా వెల్లడించింది.

Air India Services: ఎయిరిండియా (Air India)ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాని అభివృద్ధిలో భాగంగా టాటా గ్రూప్‌ (Tata Group) వివిధ మార్పులకు శ్రీకారం చుడుతోంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సమయంలో ఆధ్యాత్మిక నగరానికి దిల్లీ నుంచి విమాన సర్వీసులను గత సంవత్సరం డిసెంబర్​లో ఎయిరిండియా (Air india) ప్రారంభించింది. ప్రయాణీకులకు ఆకర్షణీయమైన ఛార్జీలను ఎయిర్ ఇండియా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. నిర్దేశించిన అంతర్జాతీయ రూట్లలో కూడా ఇలాంటి ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details