రాబోయే రోజుల్లో ఏఐ సాంకేతికత రాజ్యమేలుతుంది: AICTE CCO చంద్రశేఖర్ - AICTE CCO Chandrasekhar Interview
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 1:43 PM IST
|Updated : Aug 26, 2024, 1:48 PM IST
AICTE Chief Coordinating Officer Interview: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రంగ ప్రవేశం చేసింది. దీనికితోడు రాబోయే రోజుల్లో ఏఐ సాంకేతికత రాజ్యమేలబోతోందని అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది. ఏఐ కోర్సులను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టినప్పటికీ, పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతున్నాం. దీనిని భర్తీ చేయాలంటే పరిశ్రమలు విద్యాసంస్థలు మధ్య అనుసంధాన్ని మరింత బలోపేతం చేయాలి. మరి, అది ఎలా? ఇదే విషయం మనకు వివరిస్తున్నారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యకేషన్ చీఫ్ కో-ఆర్డినేటింగ్ అధికారి బి. చంద్రశేఖర్.
విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం కోసమే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రయత్నాలు చేస్తోందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కొత్తగా పరిశ్రమకు చెందిన నిపుణులే కళాశాలల్లో పాఠాలు చెప్పేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సాంకేతిక విద్యలో వివిధ రకాల టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినందున వాటన్నిటినీ అందిపుచ్చుకుని నైపుణ్యం పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌తో పాటు సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులకు డిమాండ్ ఉందన్నారు. వచ్చే 5-10 ఏళ్లలో వచ్చే మార్పు చేర్పులకు అనుగుణంగా కోర్సులు, పాఠ్యాంశాలు మార్పులు చేస్తున్నామని ఈటీవీ భారత్‌కి వెల్లడించారు. ఏపీలోనూ అపారమైన ఉపాధి అవకాశాలున్నాయని వీటిని అందిపుచ్చుకునేలా యువత ప్రయత్నాలు చేయాలన్నారు. ఈటీవీ భారత్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐసీటీఈ సంస్థ సీసీఓ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు తెలియజేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.