ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'వైఎస్సార్సీపీ సర్పంచ్‌ భూ ఆక్రమణలు'- సబ్‌ కలెక్టరేట్‌ వద్ద బాధితుల ఆందోళన - Agitation Against YSRCP Sarpanch - AGITATION AGAINST YSRCP SARPANCH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 3:11 PM IST

Updated : Aug 5, 2024, 3:23 PM IST

Agitation Against YSRCP Sarpanch: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు వైఎస్సార్సీపీ సర్పంచ్ వెంకట రమణారెడ్డి తమ భూములు ఆక్రమించారని బాధితులు ఆందోళనకు దిగారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. భూ రికార్డులు మార్చేసి ఐదేళ్లుగా తమను ఇబ్బందులకు గురిచేశాడంటూ పురుగుల మందు డబ్బాలతో కార్యాలయం ముందు బైఠాయించారు. గ్రామ సర్పంచ్ వెంకట రమణారెడ్డిపై చర్యలు తీసుకుని దుర్మార్గపు పాలన, భూ దందాలు అరికట్టాలంటూ నినాదాలు చేశారు. 

"బోదపాడు సర్పంచ్ మా పెదనాన్నను అడ్డం పెట్టుకుని మా భూములను తన పేరుపై ఆన్​లైన్​లో ఎక్కించుకున్నాడు. సుమారు 70 లక్షల రూపాయలు విలువచేసే భూములను ఆక్రమించుకున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా భూములను ఆక్రమించి మాకు అన్యాయం చేశాడు. ఈ నేపథ్యంలోనే మేం ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద దర్నాకు దిగాం. అధికారులు మా సమస్యపై స్పందించి సర్పంచ్​పై చర్యలు తీసుకుని మా భూములు మాకు ఇప్పించాలని కోరుతున్నాం." - పోరెడ్డి శ్రీనివాస రెడ్డి, బాధితుడు

Last Updated : Aug 5, 2024, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details