ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎంపీ మార్గాని భరత్ స్మగ్లింగ్- ఇవిగో ఆధారాలు : ఆదిరెడ్డి వాసు - adireddy vasu Criticized mp barath - ADIREDDY VASU CRITICIZED MP BARATH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 5:22 PM IST

Adireddy Vasu Fire MP Barath : రాజమహేంద్రవరం వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ తన అనుచరులతో స్మగ్లింగ్ చేయిస్తున్నారని తెలుగుదేశం నేత ఆదిరెడ్డి వాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్​గా పేరొందిన భరత్ ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. భరత్ అనుచరుడు నరేష్ కుమార్ జైన్ దిల్లీలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులుకు చిక్కాడని తెలిపారు.  జైన్ నుంచి గత సంవత్సరం నవంబర్ 4న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రూ. 2.81 కోట్ల విలువైన 5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. 

అలాంటి నేరస్థుడైన జైన్​తో కలిసి భరత్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం మీడియాకు చూపించారు. జైన్​తో కలిసి భరత్ ఎన్నికల ప్రచారం చేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో పనులు నాసిరకంగా చేయించిన భరత్ 25 శాతం కమిషన్ దండుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details