తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి డింపుల్ హయాతి - Dimple Hayathi Visits Tirumala - DIMPLE HAYATHI VISITS TIRUMALA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 10:49 PM IST
Actress Dimple Hayathi Visits Tirumala Temple : తిరుమల శ్రీవారిని టాలీవుడ్ ప్రముఖ నటి డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి సినీ నటి వస్తుండటంలో తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నటి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అయితే డింపుల్ హయాతి స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చాక సందడి వాతావరణం నెలకొంది. ఆలయ బయట ఉన్న భక్తులు నటిని చూసేందుకు భారీగా వచ్చారు. అలాగే ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. డింపుల్ హయాతి 2017లో గల్ఫ్ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. 2019లో యురేకా సినిమాలో నటించింది. అలాగే గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెమ్ సాంగ్లో నటించింది. అదేవిధంగా 2022లో విడుదలైన ఖిలాడి సినిమాలో నటించింది.