ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పట్టాలు తప్పిన గూడ్స్ - రైళ్ల రాకపోకలకు అంతరాయం - GOODS TRAIN DERAILED IN ALLURI DIST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 4:33 PM IST

A Goods Train Derailed in Chimidipalli Borra Railway station of Alluri District : అల్లూరి జిల్లా చిమిదిపల్లి- బొర్రా రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో వెళ్తున్నప్పడు ఈ ఘటన జరిగింది. గూడ్స్‌ రైలు ప్రమాదంతో అరకు నుంచి విశాఖకు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా కిరణ్‌డోల్‌-కొత్తవలస ప్యాసింజర్‌ రైలును రైల్వే అధికారులు బొర్రా రైల్వేస్టేషన్‌ సమీపంలోనే నిలిపేశారు. ప్లాట్‌ఫారం లేని ప్రాంతంలో రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. 

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. పలు రైళ్లను నిలిపివేడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. పట్టాలు తప్పింది గూడ్స్​ రైలు కావడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఒక వేళ సాధారణ రైలు పట్టాలు తప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రయాణికులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details