ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అన్నవరం అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటం బహుకరణ - Diamond Crown in Annavaram - DIAMOND CROWN IN ANNAVARAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 10:24 AM IST

Devotee Donates Diamond Crown in Annavaram : కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటాన్ని ఓ భక్తుడు కానుకగా సమర్పించారు. ఈ మేరకు భక్తులకు ఆగస్టు 6 నుంచి అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా దర్శనమివ్వనున్నారు. పెద్దాపురం శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు సుమారు రూ.కోటిన్నరతో (కిలో బంగారం, 130 క్యారెట్ల వజ్రాలతో) దీనిని తయారు చేయించారు. అలాగే స్వామి, అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను చేయించారు.

సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ పర్వదినం రోజున ఆగస్టు 6న అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. అమ్మవారి శిరస్సుకు కిరీటాన్ని, స్వామి, అమ్మవార్లకు కర్ణాభరణాలను అర్చకులు అలంకరించనున్నారు. రెండేళ్ల కిందట సత్యదేవునికి వజ్రకిరీటాన్ని దాత సత్యప్రసాద్‌ తయారు చేయించారు. అంతేకాకుండా ఆయన ప్రసాదం తయారీ భవనం, ప్రధానాలయం గోడలకు బంగారు తాపడం, సహస్ర దీపాలంకరణ మందిరం, హారతి సేవకు దీపాలు, నిత్యకల్యాణ మండపం ఇలా అనేక కార్యక్రమాలు అన్నవరంలో చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details