తెలంగాణ

telangana

ETV Bharat / videos

సాగర్​కు పోటెత్తిన వరద - 26 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల - 26 gates opened in Nagarjuna Sagar - 26 GATES OPENED IN NAGARJUNA SAGAR

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 3:23 PM IST

26 Gates Opened in Nagarjuna Sagar : నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఏకంగా 2 లక్షల 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 18 గేట్లను ఐదు అడుగుల మేర, 8 గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి స్పిల్​వే ద్వారా 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో ఎగువ నుంచి వచ్చే వరదను, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గానూ, ప్రస్తుత నీటినిల్వ 309 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహంను బట్టి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details