ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

15 ఏళ్ల బాలుడు అదృశ్యం- వంతెన సమీపాన బాలుడి సైకిల్‌- గాలింపు చర్యలు - 15 Year Old Boy missing - 15 YEAR OLD BOY MISSING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 1:52 PM IST

15 Year Old Boy Washed Away at Bridge Near Mirthipadu Bobbillanka at East Godavari District : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడు-బొబ్బిల్లంక సమీపంలో కొట్టుకుపోయిన వంతెన వద్ద 15 ఏళ్ల బాలుడు అదృశ్యం అయ్యాడు. కొట్టుకుపోయిన వంతెన సమీపాన బాలుడి సైకిల్ ను తల్లిదండ్రులు గుర్తించారు. బాలుడు నీటిలో మునిగిపోయాడన్నఅనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. (NDRF) బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు పదో తరగతి చదువుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

జోరుగా కురుస్తున్న వానలకు వాగుల వంకలు పొంగిపోతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపునక గురవుతున్నాయి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. గోదావరి ఉద్ధృతి పెరిగి ఇన్​ ఫ్లో, అవుట్​​ ఫ్లో గణణీయంగా పెరిగిందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. విపత్తు నిర్వహణ బృందాలు, సహాయక సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details