WhatsApp Down: పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి వాట్సాప్ డౌన్ కారణంగా గందరగోళం నెలకొంది. దీంతో వాట్సాప్ వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు దీనిపై పలువురు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (గతంలో ట్విటర్) వేదికగా ఫిర్యాదులు చేశారు. వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ కాలేకపోతున్నామని, మెసెజ్‌లను పంపించడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారని వినియోగదారులు నివేదించారు.
గ్లోబల్‌గా వాట్సాప్ అంతరాయం:ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్ డౌన్ కారణంగా వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ చేయడంలో విఫలం అవుతోంది. అలాగే మెసెజ్‌లను పంపించడంలో కూడా సమస్య ఉంది. అయితే దీనిపై వాట్సాప్ సంస్థ మెటా ఇప్పటికీ స్పందించలేదు. ఈ సమస్యలకు గల కారణంపై ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు.