Realme P3 Pro 5G:దేశీయ మార్కెట్లోకి పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రియల్మీ నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ తన 'P' లైనప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరిస్‌లోని ఒక మోడల్ అంటే 'రియల్మీ P3 ప్రో 5G' అనే స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌పై గత కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తుండగా.. తాజాగా కంపెనీ ఈ ఫోన్ లాంఛ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
రియల్మీ P3 ప్రో రిలీజ్ ఎప్పుడంటే?:కంపెనీ ఈ ఫోన్‌పై ఫిబ్రవరి 6, 2025న ఒక పత్రికా ప్రకటనను పంచుకుంది. దీని ద్వారా ఫోన్ లాంఛ్ తేదీని వెల్లడించింది. దీని ప్రకారం కంపెనీ 'రియల్మీ P3 ప్రో' స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనుంది. ఈ ఫోన్ రియల్మీ P సిరీస్‌లో మొదటి మోడల్. దీంతోపాటు కంపెనీ ఈ సిరీస్‌లో 'రియల్మీ P3 5G', 'రియల్మీ P3x', 'రియల్మీ P3 అల్ట్రా' అనే మోడల్స్‌ను కూడా ప్రారంభించొచ్చు.
రియల్మీ వీటిలో ప్రాసెసర్ కోసం పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. ఈ సెగ్మెంట్లో TSMC ప్రాసెస్ ఆధారంగా 4nm చిప్‌సెట్‌తో వస్తున్న మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఇది ప్రీవియస్ వెర్షన్ చిప్‌సెట్‌తో పోలిస్తే 20% మెరుగైన CPU అండ్ 40% మెరుగైన GPU పనితీరును అందిస్తుందని అంటోంది.
AnTuTu బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్ 8,00,000 పాయింట్లను స్కోర్ చేయగలదని రియల్మీ పేర్కొంది. GT బూస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇది AI అల్ట్రా-స్టిప్ ఫ్రేమ్స్, హైపర్ రెస్పాన్స్ ఇంజిన్, AI అల్ట్రా టచ్ కంట్రోల్ అండ్ AI మోషన్ కంట్రోల్ ఫీచర్లను అందిస్తుంది.