తెలంగాణ

telangana

ETV Bharat / technology

ధర ఎక్కువైనా తగ్గేదే లే- ప్రీమియం బైక్స్​కే యువత సై - Premium Bike Sales in India

Premium Bike Sales in India: ధర ఎక్కువైనా తగ్గేదే లే అంటూ ప్రీమియం బైక్స్ కొనుగోలుపై యువత ఆసక్తి చూపిస్తోంది. బైక్స్ సేల్స్​లో ఖరీదైన మోటార్‌ సైకిళ్ల వాటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.

Premium Bike Sales in India
Premium Bike Sales in India (Royalenfield)

By ETV Bharat Tech Team

Published : Oct 6, 2024, 10:30 AM IST

Updated : Oct 6, 2024, 10:37 AM IST

Premium Bike Sales in India: ప్రస్తుతం మార్కెట్లో బైక్స్​కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్​పై రయ్​ రయ్​ మంటూ దూసుకుపోవడమంటే యువతకు భలే సరదా. వీటిలో మంచి స్ట్రైలిష్ లుక్స్​లో ఉన్న ప్రీమియం బైక్స్​ను కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది బైక్స్ సేల్స్​లో ఖరీదైన మోటార్‌ సైకిళ్ల వాటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో కస్టమర్ల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పుటికప్పుడు తమ కొత్త మోడల్స్​ను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి.

ఇంజిన్‌ సామర్థ్యం:

  • మోటార్‌ సైకిళ్లలో 100 సీసీ నుంచి 350 సీసీ వరకు ఇంజిన్‌ సామర్థ్యం గలవి ఉన్నాయి.
  • సాధారణంగా మైలేజీ కోసం 100 సీసీ బైక్స్​ను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
  • 150 సీసీ, అంతకుమించి ఇంజిన్‌ సామర్థ్యమున్న వాటిని ప్రీమియం/ లగ్జరీ బైక్స్​గా పరిగణిస్తున్నారు.
  • కొన్నేళ్ల క్రితం ప్రీమియం మోటార్‌ సైకిళ్లపై వాహన తయారీ సంస్థలకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.
  • వాటి అమ్మకాలు అప్పట్లో బాగా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
  • అయితే ఇటీవల ప్రీమియం మోటార్‌ సైకిళ్ల సేల్స్ పెరగడంతో ఈ విభాగంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.

పెరుగుతున్న ప్రీమియం బైక్స్ సేల్స్:

  • దేశంలో మోటార్‌ సైకిళ్ల సేల్స్​లో ప్రీమియం వాటా ప్రస్తుతం 19%.
  • 2029 నాటికి ఇది 27- 28 శాతానికి పెరుగుతుందని మార్కెట్ నిపుణుల అంచనా.
  • వచ్చే 3-5 సంవత్సరాల పాటు దేశంలో మోటార్‌ సైకిళ్ల మార్కెట్లో 7- 8% వార్షిక వృద్ధి నమోదవుతుందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఇక్రా పేర్కొంది.
  • అంతేకాక ప్రీమియం మోటార్‌ సైకిళ్ల విభాగంలో రెండంకెల వృద్ధికి అవకాశం ఉందని కూడా పేర్కొంది.

ఫెస్టివల్ సీజన్‌పై ఆశాభావం:

  • ప్రస్తుతం దసరా-దీపావళి సీజన్‌ నడుస్తోంది. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు అనువైన ముహూర్తాలు కూడా దగ్గరలో ఉన్నాయి.
  • ఇటువంటి సమయంలో ప్రీమియం మోటార్‌ సైకిళ్లు, లగ్జరీ వాచ్​లు, ఖరీదైన పర్సులు, ఆభరణాల సేల్స్ బాగా పెరుగుతాయి.
  • వీటితోపాటు స్పోర్ట్స్, క్రూయిజ్‌ తరగతి మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు అధికంగా జరుగుతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి.
  • ఇటువంటి మోడల్స్ మరిన్ని రిలీజ్ కాబోతున్నట్లు డీలర్లు వివరిస్తున్నారు.
  • మార్పునకు దోహదపడుతున్న అంశాలివీ
  • అధిక వార్షిక వృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో మన ఇండియా అగ్రస్థానంలో ఉంది.
  • దీనివల్ల ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. ఫలితంగా కొనుగోలు శక్తి అధికమై, ఖరీదైన - నాణ్యమైన- అధిక సామర్థ్యం కలిగిన వస్తువులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
  • మధ్యతరగతి ఆదాయ వర్గీయుల సంఖ్య అధికమవ్వడం కూడా మరో కారణం.
  • దేశంలో యువ జనాభా సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు ఇష్టపడే వస్తువుల్లో మోటార్‌ సైకిల్‌ అగ్రస్థానంలో ఉంటోంది.
  • యువత ఆసక్తికి అనుగుణంగా విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుని మరీ దేశీయ కంపెనీలు ప్రీమియం మోటార్‌ సైకిళ్లను ఆకర్షణీయ సదుపాయాలతో లాంచ్ చేస్తున్నాయి. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న మోటార్‌ సైకిల్‌ మోడళ్లలో 75శాతం ప్రీమియం తరగతివే ఉంటున్నాయి.

కంపెనీల మధ్య పోటా పోటీ:

  • ప్రీమియం బైక్స్​ విభాగంలో అధిక మార్కెట్‌ వాటా సాధించేందుకు దేశీయ టూ- వీలర్ కంపెనీలు పరస్పరం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
  • ప్రీమియం బైక్స్​ సేల్స్ విభాగంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్, జావా- ఎజ్డి, కేటీఎం, ట్రయంఫ్‌ మోడల్స్ ముందంజలో ఉన్నాయి.
  • గత కొంతకాలంగా TVS మోటార్స్, బజాజ్‌ ఆటో, హోండా మోటార్‌సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియాలు ప్రీమియం బైక్స్ విభాగంపై దృష్టి సారిస్తున్నాయి.
  • కొత్త మోడల్స్​ను తీసుకువచ్చి తమ మార్కెట్‌ వాటా పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
  • టీవీఎస్‌ మోటార్స్, తన అపాచీ మోడల్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తూ, యువతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
  • అపాచీ RTR 310 మోడల్‌ను మనదేశంలోని ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో అందిస్తూ తమ సేల్స్​ పెంచుకునే యత్నాలు చేస్తోంది.
  • బజాజ్‌ ఆటో అధిక ఇంజిన్‌ సామర్థ్యం కల విభిన్నమైన ప్రీమియం బైక్స్​ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
  • కేటీఎం, డామినర్‌లను ఎంతోకాలంగా విక్రయిస్తున్న బజాజ్ కొంతకాలం క్రితం బ్రిటిష్‌ ప్రీమియం బ్రాండ్ అయిన ట్రయంఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఇప్పటికే ట్రయంఫ్‌ బ్రాండ్ మోటార్‌ సైకిల్స్​ను మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • మరోవైపు హీరో మోటోకార్ప్‌ ఏడాదిన్నర క్రితం హార్లే డేవిడ్‌సన్స్‌ బ్రాండ్​తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
  • ఇలా దాదాపుగా అన్ని టూ- వీలర్ కంపెనీలు ప్రీమియం బ్రాండ్ మోటార్‌ సైకిల్స్​పై గట్టి కసరత్తు చేస్తున్నాయి.
  • ప్రీమియం బైక్స్​పై కంపెనీలు ఆసక్తి చూపటానికి ఈ విభాగంలో అధిక వృద్ధి నమోదు కావటం, లాభాలు ఎక్కువగా ఉండటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఈ నాలుగేళ్లలో మీరు బైక్ కొన్నారా?- అయితే ఆ మోడల్స్​ పార్టులు ఉచితంగా మార్పు! - Free Bikes Replacement Parts

మీ గర్ల్​ఫ్రెండ్​తో లాంగ్​ డ్రైవ్​కు వెళ్లాలా?- టాప్ స్టైలిష్ బైక్స్ ఇవే! - Best Stylish and Mileage Bikes

Last Updated : Oct 6, 2024, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details