తెలంగాణ

telangana

ETV Bharat / technology

యమహాకు పోటీగా హీరో- సేమ్ పవర్, ఫీచర్లతో 'జూమ్ 160' లాంఛ్- అయితే వీటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే! - HERO XOOM 160 VS YAMAHA AEROX 155

'హీరో జూమ్ 160' vs 'యమహా ఏరోక్స్ 155'- వీటిలో బెస్ట్ ఛాయిస్ ఏదంటే?

New Hero Xoom 160 vs Yamaha Aerox 155
New Hero Xoom 160 vs Yamaha Aerox 155 (Photo Credit- Hero MotoCorp, Yamaha)

By ETV Bharat Tech Team

Published : Jan 23, 2025, 3:17 PM IST

New Hero Xoom 160 vs Yamaha Aerox 155:చాలా కాలంగా భారత మార్కెట్లో 125cc కంటే ఎక్కువ సెగ్మెంట్​ స్కూటర్​ లాంఛ్ కాలేదు. అయితే కొన్ని విదేశీ బ్రాండ్లు మాత్రం కొన్ని ఖరీదైన మ్యాక్సీ స్కూటర్లను మన దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. 2021లో యమహా భారత మార్కెట్​లో 'ఏరోక్స్ 155' స్కూటర్​ను విడుదల చేసింది. ఇది భారత్​లో మొట్టమొదటి అధిక సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్, మ్యాక్సీ పెర్ఫార్మెన్స్ స్కూటర్. అయితే ఇప్పుడు దీనికి పోటీగా ఇప్పుడు హీరో మోటోకార్ప్ తన 'జూమ్ 160' స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ రెండింటి కంపారిజన్ మీకోసం.

ఇంజిన్ అండ్ పవర్ అవుట్​పుట్:

ఇంజిన్ అండ్ పవర్ అవుట్​పుట్ Hero Xoom 160 Yamaha Aerox 155
ఇంజిన్ 156cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ 155cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్
పవర్ 8,000rpm వద్ద 14.2bhp పవర్ 8,000rpm వద్ద 14.4bhp పవర్
టార్క్ 6,500rpm వద్ద 14Nm టార్క్ 6,500rpm వద్ద 13.9Nm టార్క్
పవర్-టు-రేషియో 9.7bhp/ton 8.4bhp/ton

హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155 రెండూ కూడా ఒకే rpm వద్ద దాదాపు ఒకేవిధమైన గరిష్ట శక్తిని అందించే అధునాతన 4-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్​​ను కలిగి ఉన్నాయి.

వెయిట్ అండ్ డైమెన్షన్స్:

Weight and dimensions Hero Xoom 160 Yamaha Aerox 155
సీట్ హైట్ 787 mm 790 mm
గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm 145 mm
వీల్​బేస్ 1,348 mm 1,350 mm
ఫ్యూయెల్ కెపాసిటీ 7 liters 5.5 liters
వెయిట్ 142 kg 126 kg

సస్పెన్షన్ అండ్ బ్రేక్స్:

Suspension and Brakes Hero Xoom 160 Yamaha Aerox 155
బ్రేక్ (ఫ్రంట్/రియర్) 240mm డిస్క్/130mm డ్రమ్ 230mm డిస్క్/130mm డ్రమ్
సస్పెన్షన్ (ఫ్రంట్/రియర్) టెలిస్కోపిక్ ఫోర్క్​లు/డ్యూయల్ షాక్ అబ్జార్బర్ టెలిస్కోపిక్ ఫోర్క్​లు/డ్యూయల్ షాక్ అబ్జార్బర్
టైర్స్ (ఫ్రంట్/రియర్) 120/70-14 ఫ్రంట్, 140/60-14 రియర్ 120/70-14 ఫ్రంట్, 140/60-14 రియర్

ధర:

Hero Xoom 160 Yamaha Aerox 155
Price 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్) 1.49 లక్షల నుంచి రూ. 1.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఈ కొత్త 'హీరో జూమ్‌'ను కంపెనీ రూ. 1.48 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఇది 'యమహా ఏరోక్స్ 155' స్కూటీ కంటే రూ. 1,000 నుంచి రూ. 4,000 తక్కువ. ఈ ధరతో కంపెనీ ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవటాన్ని కాస్త కష్టతరం చేసింది. రెండూ దాదాపు ఒకేలాంటి పవర్, ఫీచర్లను అందిస్తాయి. కానీ 'ఏరోక్స్' నమ్మకమైన జపనీస్ కంపెనీ ఉత్పత్తి. అయితే 'జూమ్ 160' ఈ రంగంలో ఎప్పుడూ అడుగుపెట్టని కంపెనీ ప్రొడక్ట్.

కిర్రాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంఛ్!- ధరలు ఎలా ఉన్నాయంటే?

ఎయిర్​టెల్ యూజర్లకు షాక్- ఆ రీఛార్జి ప్లాన్లలో డేటా తొలగింపు!- కారణం ఇదే!

వాట్సాప్​లో అదిరే ఫీచర్- ఇకపై ఒకే స్టేటస్​ మూడు యాప్స్​లో!- అదెలాగంటే?

ABOUT THE AUTHOR

...view details