YSRCP Neglects Supply Bills Eggs Contractors : అస్మదీయ గుత్తేదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళితో సంబంధం లేకుండా రూ.వేల కోట్లు చెల్లింపులు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారాన్ని సరఫరా చేసే గుత్తేదారులకు 130 కోట్లు రూపాయలు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెట్టింది. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఇచ్చే న్యూట్రీషియన్ కిట్లను (Nutritional Kits) సరఫరా చేసే గుత్తేదారులకు నాలుగు నెలల నుంచి (ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు) చెల్లింపులు లేవు. ఇకపై జాప్యం లేకుండా సరఫరా చేయాలంటే బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిందేనని గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు. కానీ జగన్ సర్కార్ మాత్రం వారి మాటలను చెవికి ఎక్కించుకోలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 23 లక్షల మంది చిన్నారులు, 6 లక్షల మంది గర్భిణులు, బాలింతలు సేవలు పొందుతున్నారు. వీరిలో పోషక ఆహార లోపం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అత్యవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇవేమీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కేంద్రం వాటా 46 కోట్లు రూపాయలు అందుబాటులో ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా 46 కోట్లు రూపాయలు విడుదల చేస్తే ఆ మొత్తాన్ని కలిపి గుత్తేదారులకు ఇచ్చేందుకు వీలుంటుంది. కానీ జగన్ సర్కారు మాత్రం ఆ మొత్తాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖకు విడుదల చేయడం లేదు. ఇందుకు సంబంధించి దస్త్రం 2 నెలలుగా ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉంది.
ఆరోగ్యశ్రీకి సుస్తీ! - చికిత్స అందక అల్లాడిపోతున్న రోగులు - Aarogyasri Services In AP