YSRCP Leaders Join in TDP :ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. అయిదేళ్లలో అధికార పార్టీ చేసిన అరాచకాలు భరించలేక వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు కూటమిలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యమని భావించి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
NTR District :ఎన్టీఆర్ జిల్లా నందిగామ బీసీ కాలనీకి చెందిన 30 కుటుంబాలు కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు తమను ఆకర్షించాయని, అందుకే వైసీపీని వీడి టీడీపీలోకి చేరామని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ తిరువూరు పట్టణంలో కూటమి అభ్యర్థి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది జోరుగా తెలుగుదేశంలోకి వైసీపీ నేతల చేరికలు - TDP To YCP
Anantapuram District :అనంతపురం జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. నిత్యం అర్బన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నారు. ఇవాళ హరిజన కాలనీకి చెందిన 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలు నచ్చకనే వీరందరూ అధికార పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రేణులను కోరారు. కళ్యాణదుర్గంలో 105 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.