YSRCP Leaders Join in TDP : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలుగుదేశం పార్టీలో జోష్ మెుదలైంది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు టీడీపీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా వంగర మండలం శివ్వాం గ్రామంలోని 300 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంత మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. అలాగే వంగరం మండలంలోని ఓని అగ్రహారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు సైతం టీడీపీలోకి చేరారు.
వైఎస్సార్సీపీకి పలువురు నాయకులు గుడ్ బై - టీడీపీలోకి భారీగా చేరికలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అభివృద్ది పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు. చంద్రబాబు పోలవరాన్ని 70 శాతం పూర్తిచేస్తే, ప్రభుత్వం మారిన తరువాత జగన్ మోహన్ రెడ్డి 10 శాతం పనులు కూడా పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనలో అక్రమలు, భూ కబ్జాలు ఇసుక దోపిడీలు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ,టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
YCP Leaders Huge Joinings To TDP : తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన కౌన్సిలర్ షేక్ అమ్రిన్, పురపాలక సంఘం వైఎస్ ఛైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది పైగా యువకులు, మహిళలు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాలంటీర్లు ఓటర్లను భయభ్రంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా టీడీపీకి ఓటు వేయాలని కోరారు. మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.