ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టుకు క్యూ కడుతున్న వైఎస్సార్సీపీ నేతలు - బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి - YSRCP Leaders bail petition - YSRCP LEADERS BAIL PETITION

YSRCP Leaders Filed Petition in High Court for Bail TDP Office Attack Case : మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో హైకోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు క్యూ కడుతున్నారు. కీలక నేతల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్​ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు 14 రోజుల పాటు రిమాండ్​ విధించారు.

ysrcp_bail_petition
ysrcp_bail_petition (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 11:54 AM IST

హైకోర్టుకు క్యూ కడుతున్న వైఎస్సార్సీపీ నేతలు - బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ETV Bharat)

YSRCP Leaders Filed Petition in High Court for Bail TDP Office Attack Case :మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు అరెస్టు భయంతో ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టుకు క్యూ కడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఇదేకేసులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ దాఖలు చేసిన వ్యాజ్యాలు హైకోర్టులో బుధవారం(జులై 10న) విచారణకు వచ్చాయి. విచారణను గురువారానికి వాయిదా వేయాలని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి - అప్పిరెడ్డి బెయిల్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా - HC on Lella Appireddy Petition

ఈ కేసులో మరో ఇద్దరు తాజాగా పిటిషన్లు వేశారని ప్రస్తుత వ్యాజ్యాలను వాటితో కలిపి విచారణ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇవాళ్టికి వాయిదా పడింది.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - కీలక నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు - TDP Office Attack Case

వల్లభనేని వంశీ అనుచరులకు 14 రోజులు రిమాండ్​ :కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్‌ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 నిందితుల్లో 15 మందిని మంగళవారం (జులై 9న) అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎర్రగుళ్ల నాగేష్‌ సహా 15 మందిని రిమాండ్‌ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్‌లో ఒక పేరు, మరోచోట ఇంకొ పేరును సగం పేరును నమోదు చేశారు. ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లు న్యాయమూర్తి గుర్తించారు. నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. దీంతో బుధవారం రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజులు పాటు రిమాండ్‌ విధించారు.

ఎన్టీఆర్​ భవన్​పై దాడి కేసులో తీగ లాగుతున్న పోలీసులు- సూత్రధారులపైనా నజర్​ - attack on NTR Bhavan

ABOUT THE AUTHOR

...view details