YSRCP Leaders Attacked TDP Leaders in Joint Kurnool District:కర్నూలులో ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. శ్రీరామ నగర్ పోలింగ్ బూత్ వద్ద మరియు సిల్వర్ జూబ్లీ కళాశాల వద్ద వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులను అక్కడి నుంచి పంపివేశారు. దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తన ఓటు హక్కును పంచలింగాల గ్రామంలో వినియోగించుకోగా కర్నూలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రామయ్య కర్నూలులోని గణేష్ నగర్లో తన ఓటు హక్కును నియమించుకున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు తన ఓటు హక్కును సిల్వర్ జూబ్లీ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి వేశారు. కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టీడీపీ Vs వైఎస్సార్సీపీ - రణరంగంగా మారిన కడప జిల్లా - tdp ysrcp clashes in ysr kadapa
Pattikonda Constituency:ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం జి. లింగాపురంలో టీడీపీ- వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆదోనిలో ఓటరు స్లిప్పై తన ఫొటో ముద్రించి పంపిణీ చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం రామవరంలో టీడీపీ-వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువురినీ బయటకు పంపించారు.
Yemmiganur constituency:ఎమ్మిగనూరు పట్టణంలోని 130, 135 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఓటర్లు వర్షంలో ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేసేందుకు వచ్చారు. ఈవీఎంలు మొరయింపుతో గంట సేపు పోలింగ్ కేంద్రాల వద్ద నీరిక్షించారు. పోలింగ్ సరళిని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈవీఎంలు మొరయింపును అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.