YSRCP Leaders Illegal Layouts in Nellore : మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాకాణి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడేరు పరిధిలో సర్వే నంబరు 828, 8307-Aలతో పాటు పొదలకూరు పరిధిలోని 174తో కలిసి మొత్తం 18.44 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇది పొదలకూరుకు సమీపంలోని రహదారికి అనుకుని ఉంది.
గతంలో వ్యవసాయ భూమి కాగా దీంట్లో లేఅవుట్ ఏర్పాటు చేశారు. అధికారం ఉందని తమను ఎవరు అడ్డుకుంటారులే అనే ధీమాతో నుడా నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. స్వర్ణా గార్డెన్స్ పేరుతో రాళ్లు పాతారు. రోడ్లు వేయడంతో పాటు కాలువలు తవ్వారు. మొత్తంగా 207 ప్లాట్లు వేశారు. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎలాగైనా వాటిని విక్రయించాలన్న దుర్బుద్ధితో నకిలీ డీటీసీపీ అనుమతి పత్రాలు సృష్టించారు.
రియల్ఎస్టేట్ బిజినెస్ కేరాఫ్ వైఎస్సార్సీపీ లీడర్స్- తుడా, నుడా, వీఎంఆర్డీఏ నిధులతో స్వప్రయోజనాలు - Urban development Organizations
వాటిపై డీటీసీపీ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఏడీఎంల సంతకాలు ఫోర్జరీ చేశారు. వాటిని చూపించి విక్రయాలు చేస్తున్నారు. నగదు తీసుకుని కాగితాలపై ఒప్పందాలు రాసుకుంటున్నారు. విషయం నుడా వీసీ బాపిరెడ్డి దృష్టికి రావడంతో గురువారం పొదలకూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆక్రమంగా లేఅవుట్ వేయడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు చేయడంపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
గత ఐదేళ్లుగా కాకాణి గోవర్దన్‌రెడ్డి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. లేఅవుట్ వేయడం నుంచి ఆ ప్రాంతంలో మెరకవేసేందుకు మట్టి తరలింపు వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవనే విమర్శలున్నాయి. అందులో 'స్వర్ణా గార్డెన్స్' లేఅవుట్ ఒకటి. దీని విస్తీర్ణం 18.44 ఎకరాలు కాగా ఇదంతా ఆడంగల్లో వ్యవసాయ భూమిగానే ఉంది. కనీసం వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకూ యత్నించలేదు. అలాగే లేఅవుట్ వేశారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ లే - అవుట్ల దందా - నిమ్మకునీరెత్తినట్లుగా జగన్ సర్కారు
రోడ్డుకు దిగువగా ఉండే దానిలో మెరక తోలేందుకు వెంకటాచలం మండలం కనుపూరు చెరువు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా టిప్పర్లతో మట్టిని తరలించారు. దీని కోసం కనుపూరు చెరువు ఆయకట్టు రైతులకు నీరివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అనుమతి ఉందన్న కారణం చూపి ప్లాట్ల ధరలు విపరీతంగా పెంచారు. ఒక్కో అంకణం ప్లాటును లక్షన్నర వరకు విక్రయించారు. కొనుగోలుదారులు నుంచి కోట్లు వసూలు చేశారు. ప్రస్తుతం ఆ లేఅవుటును అధికారులు పరిశీలించడం కేసు నమోదు చేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
ప్లాట్లు కొనుక్కున్న ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులను నమ్మి మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఎలాగైనా తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
Illegal Layouts: ఎవడ్రా మనల్ని ఆపేది.. అక్రమ లేఅవుట్లతో రెచ్చిపోతున్న వైఎస్సార్సీపీ నాయకులు