YSRCP Leader Asked to Join party at Martur: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందో రాదో అనే అనుమానంతో అధికార పార్టీ నేతలు ఏ చిన్న అవకాశం దొరికినా విడిచిపెట్టటం లేదు. సమస్యలు పరిష్కరించాలని అధికార పార్టీ నేత వద్దకు వెళ్తే సమస్య గురించి పట్టించుకోకుండా వైఎస్సార్సీపీలో చేరాలని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పాటుపడాలని ఆ నేత కోరడం వ్యాపారుల్లో చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల వేళ టీడీపీ నేతలపై అక్రమ కేసులు- 'జగన్ కక్ష సాధింపు చర్యలు'
బాపట్లలో గ్రానైట్ వ్యాపారుల కష్టాలు: పన్నుల భారంతో, విద్యుత్తు ఛార్జీల భారంతో గ్రానైట్ పరిశ్రమ కునారిల్లుతోంది. కనీసం నిర్వహణ వ్యయాలు రాబట్టుకోలేక గ్రానైట్ పరిశ్రమ సతమతమవుతోంది. దీంతో బాపట్ల జిల్లా మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా పరిశ్రమల్ని మూసేసుకున్నారు. అయినా యంత్రాంగం తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతోంది. ఈ తనిఖీల (raids) నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ కొందరు వ్యాపారులు అద్దంకి వైఎస్సార్సీపీ నేతను ఆశ్రయించారు. సహాయం కోరి వెళ్లిన వ్యాపారులు వింత అనుభవం ఎదురైంది. సమస్యపై బాధితులకు ఊరట దక్కకపోగా పార్టీలో చేరాలని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పాటుపడాలని ఆ నేత కోరడం వ్యాపారుల్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికిప్పుడు నేనైతే తనిఖీలు ఆపాలని చెప్పలేను, అధికారులు కొలతలు కొలిచే విషయంలో, మరో రకంగా అన్యాయం జరిగిందని చెబితే స్వయంగా నేనే వచ్చి మీ క్వారీలు ముందు నిలబడతా, ఆ విషయంలో మీకు అన్యాయం జరగకుండా చూస్తా అని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నాడు. మీరంతా ఏ పార్టీ నాయకులతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారో ప్రత్యేకించి చెప్పను, ఈ ఒక్కసారికి వైఎస్సార్సీపీ గెలుపునకు పాటుపడండి, వెంటనే వచ్చి పార్టీలో చేరండి, మీకు అండగా ఉంటా అని కోరారు. ఇప్పుడు చేరకుండా తర్వాత చేరతామంటే కుదరదు, అప్పుడు ద్వారాలు మూసేస్తాం అని చెప్పటం గమనార్హం.