YSRCP Govt Neglected Universities Development:విద్యార్థులు కట్టే ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హారతి కర్పూరంలా కరిగించేసింది. వర్సిటీల్లో కనీస అభివృద్ధి కూడా చేయకుండా వదిలేసి వెళ్లిపోయింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేనాటికి కృష్ణా విశ్వవిద్యాలయం ఖాతాలో 110 కోట్లకు పైగా నిధులున్నాయి. గత ఐదేళ్లలో జగన్ ఆశీస్సులతో వచ్చిన వీసీలంతా ఈ నిధులపై కన్నేసి వాటిలో 37 కోట్లు కరిగించేశారు. ప్రస్తుతం కృష్ణా వర్సిటీ ఖాతాలో 73కోట్లు మాత్రమే మిగిలాయి. ఇవికాకుండా ఏటా విశ్వవిద్యాలయానికి 6 కోట్ల రూపాయల వరకూ రకరకాల ఫీజుల రూపంలో ఆదాయం వస్తుంది.
ప్రధాన ద్వారం వద్ద వైఎస్సాఆర్ విగ్రహం: గత ఐదేళ్లలో ఇదో 30 కోట్ల రూపాయాలు కలిపితే మొత్తంగా 67 కోట్ల రూపాయలకుపైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీసీలుగా వచ్చిన వాళ్లు ఖర్చు చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో ఆరంభించిన అభివృద్ధి పనుల్ని ఎక్కడికక్కడే వదిలేశారు. విద్యార్థుల వసతులకు సంబంధించిన 5లక్షల రూపాయలతో కృష్ణా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం అనుబంధ కళాశాలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఓ మూలన పడేశారు.
విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార కేంద్రంగా మార్చిన వైఎస్సార్సీపీ - YSRCP Irregularities Matam Lands
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం శివారులోని రుద్రవరంలో 71 కోట్ల రూపాయలతో కృష్ణా విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణం నిర్మించారు. విద్యార్థులకు అవసరమైన వసతి గృహాలు, క్రీడా మైదానం, ఫార్మా సైన్స్, రీసెర్చ్ భవనాలు, ఇంజినీరింగ్ కళాశాల, ఫుడ్‌కోర్టు, విశ్వవిద్యాలయం చుట్టూ ప్రహరీ గోడ, ప్రవేశ ద్వారం, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌ల కోసం షెడ్ల నిర్మాణం ప్రభుత్వం డబ్బులతో చేపడతామంటూ అప్పట్లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఈలోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకుండా విశ్వవిద్యాలయం ఖాతా నుంచి వాడుకోవాలని ఆదేశించింది.
వైఎస్సార్సీపీతో అంటకాగే వీసీ, రిజిస్ట్రార్ సహా ఉన్నతాధికారులంతా వెంటనే వర్సిటీ ఖాతాలోని 110 కోట్లను కరిగించేందుకు రంగంలోకి దిగారు. 43 కోట్ల 31లక్షల రూపాయలతో ఈ భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. వైఎస్సార్సీపీకి చెందిన విశాఖ మాజీ ఎంపీకి సన్నిహితుడైన ఓ గుత్తేదారుకు సబ్‌కాంట్రాక్టును ఇచ్చారు. ఇప్పటివరకూ 23కోట్ల రూపాయలను గుత్తేదారుకు చెల్లించారు. కానీ పనులు మాత్రం 10కోట్ల విలువైనవి కూడా చేపట్టలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు, గుత్తేదారుతో కలిసిపోయి ఈ డబ్బులను తినేశారని విమర్శిస్తున్నారు.