YSRCP Government Cheating Employees in PRC Issue :ఉద్యోగుల పీఆర్సీ విషయంలో గత ప్రభుత్వం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి సిఫార్సు చేయకుండానే అసలు ఉద్యోగుల నుంచి ఒక్క విజ్ఞాపన పత్రాన్ని తీసుకోకుండానే 12వ పీఆర్సీ కథ ముగిసిపోయింది. ఈ నెల 14 తేదీన పీఆర్సీ కమిషనర్, విశ్రాంత ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు లేఖ రాశారు.
Jagan Cheating Employeees :2023 జూలై లో తనను 12వ పీఆర్సీ కమిషనర్‌గా తనను జగన్ ప్రభుత్వం నియమించినప్పటికీ ఉద్యోగులను, సిబ్బందినీ కేటాయించక పోవటంతో ఎలాంటి సిఫార్సులూ చేయలేక పోయనట్టు పేర్కోన్నారు. తక్షణం 132వ పీఆర్సీ కమిషనర్‌గా తనను రిలీవ్ చేయాలని కోరుతూ సీఎస్నీరబ్ కుమార్ ప్రసాద్‌కు లేఖ రాశారు. పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ లేఖతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నిట్టనిలువునా మోసం చేసినట్టు తేటతెల్లం అవుతోంది. ఉద్యోగుల తీవ్ర ఆందోళనల మధ్య 2022లో రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం మేర రివర్సు పీఆర్సీని ప్రకటించింది. తదుపరి వేతన సవరణ సంఘాన్ని వేస్తున్నట్టు ప్రకటించినా ప్రస్తుతం 12వ పీఆర్సీ కమిషనర్ ఏడాది కాలంగా ఏ సిఫార్సూ చేయలేకపోయానని పేర్కోంటూ లేఖ రాయటంతో జగన్ సర్కారు చేసిన మోసం బట్టబయలైంది.
ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును ప్రభుత్వం కాజేసింది : సూర్య నారాయణ - KR Suryanarayana