YS Sharmila Reddy Counter to YS Vimala Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై షర్మిల (YS Sharmila), ఆమె మేనత్త విమలారెడ్డి మాటల యుద్ధానికి దిగారు. షర్మిల, సునీత పులివెందుల సభలో ఇంటి పరువు తీసే విధంగా మాట్లాడుతున్నారని విమలారెడ్డి మాట్లాడటంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తమ మేనత్త విమలారెడ్డి కుమారుడికి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు ఇవ్వడం వల్లనే వారికి అనుకూలంగా ఆమె మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. అవినాష్ రెడ్డి గురించి తామేమీ అనవసరంగా ఆరోపణలు చేయడం లేదని సీబీఐ చెప్పిన విషయాలనే తాను, సునీత మాట్లాడుతున్నామని వ్యాఖ్యానించారు.
తమ మేనత్త విమలారెడ్డికి వయసు ఎక్కువ అయినందువలన ఏదేదో మాట్లాడుతున్నారనీ, సీబీఐ అన్ని ఆధారాలు చూపించినందువల్లే అవినాష్ రెడ్డి నిందితుడని తాము ఆరోపణలు చేస్తున్నాం అని షర్మిల తెలిపారు. తాను, సునీత ఎందుకోసం పోరాటం చేస్తున్నామో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. విమలా రెడ్డికి వివేకానంద రెడ్డి ఎంత చేసి ఉంటాడో ఆమెకు తెలియదా అని షర్మిల అన్నారు. సొంత అన్నను చంపితే వివేకానంద రెడ్డిపై కృతజ్ఞత లేకుండా అవినాష్‌కు, జగన్‌కు తమ మేనత్త విమలారెడ్డి వత్తాసు పలకడం ఏమిటనీ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
విమలమ్మ కొడుక్కి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారు- ఆర్థికంగా బలపడి అన్నీ మరిచిపోయారు: షర్మిల - Sharmila Counter to Vimala Reddy
YS Vimala Reddy Comments: వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. షర్మిల, సునీత చేస్తున్న పనుల వల్ల తమ కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారని చెప్పారు. శత్రువులంతా ఒక్కటైనప్పుడు సొంత కుటుంబ సభ్యుడికి అందరూ తోడుగా ఉండాలని హితవు పలికారు. తమ ఇంటి ఆడపిల్లలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని బజారుపాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. వారి వ్యాఖ్యలను భరించలేకపోతున్నానని పేర్కొన్నారు.
వివేకానందరెడ్డిని వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య చేయడాన్ని వారు చూశారా అని ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే డిసైడ్ చేసేస్తే, ఇంక కోర్టులు, జడ్జిలు ఎందుకని అడిగారు. హత్య చేసిన వాడు బయట తిరుగుతున్నాడని, అతను చెప్పిన మాటలు విని అవినాశ్‌పై ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. వివేకా హత్య అంశంలోకి జగన్‌ను కూడా లాగుతున్నారని విమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినాశ్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని విమర్శించారు. అవినాశ్‌కు కూడా ఒక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఏ పాపం చేయని తన సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాది కాలంగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌పై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో, హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి: షర్మిల - YS Sharmila Election Campaign
షర్మిల Vs విమల - కుటుంబ సభ్యుల పరస్పర ఆరోపణలతో హీటెక్కిన ఏపీ